17 July, 2026 | 8:52 PM

Breaking News

సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •  

మండల పరిషత్ కార్యాలయంలో శుభ్రత కార్యక్రమం

06-03-2026 09:22 PM

వాంకిడి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక వాంకిడి మండల పరిషత్ కార్యాలయంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న ఆధ్వర్యంలో కార్యాలయంలో పేరుకుపోయిన పనికిరాని పాత ఫైళ్లు, రికార్డు లను గుర్తించి శుభ్రపరచి క్రమ బద్ధీకరించారు.

ముఖ్యమైన పత్రాలను శుభ్రంగా సర్దివేసి భద్రతా చర్యలతో ఇనుప పెట్టెలలో భద్రపరిచారు. కార్యాలయంలో అవసరమైన సామగ్రిని సక్రమంగా ఏర్పాటు చేసి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి జావీద్, ఉపాధి హామీ ఏపీఓ శ్రావణ్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.