24 March, 2026 | 4:08 AM

సిలిండర్స్ అక్రమంగా వినియోగిస్తున్న వారిపై సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం దాడులు

24-03-2026 12:47 AM

దేవరకొండ, మార్చి 23 :  సిలిండర్స్ అక్రమముగా వినియోగిస్తున్నవారిపై సివిల్ సప్లయ్ ఇన్ఫోర్స్మెంట్ టీం దాడులు నిర్వహించారు. సోమవారం దేవరపట్టణంలో చికెన్ సెంటర్లు, హోటల్స్ మరియు బేకరీలలో డోమెస్టిక్ సిలిండర్స్ అక్రమముగా వినియోగిస్తున్నవారిపై సివిల్ సప్లయ్ ఇన్ఫోర్స్మెంట్ టీం  దాడులు నిర్వహించారు.

అక్రమంగా వినియోగిస్తున్న 27 సిలిండర్లలో 3 నిండు సిలిండర్లు 24 ఖాళీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు  భద్రత నిమిత్తము హెచ్ పి గోదాములో అప్పగించారు  తనిఖీ దాడులలో  సివిల్ సప్లయ్స్ అధికారులు, బోడిగే అంజయ్య  ఓఎస్డీ,  ఈటీసి,సభ్యులు ఎండి కమాల్ పాషా, టౌన్ సీఐ వెంకట్ రెడ్డి డిప్యూటీ తాసిల్దార్స్ సివిల్ సప్లయ్స్ ఎస్డి. ముబీన్, డిటీసీఎస్, ఏ. దీపక్,  ఏ. సైదులు, కుమార్ రెడ్డి, టాస్క్ఫోర్స్ సిబ్బంది సైదులు తదితరులు పాల్గొన్నారు.