‘మన ఊరు–మన అంగన్వాడి’ నినాదంతో బడిబాట కార్యక్రమం
13-06-2026 09:42 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): చిన్నారుల విద్యాభివృద్ధి, అంగన్వాడి కేంద్రాల పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో కోనరావుపేట మండల కేంద్రంలోని 4వ అంగన్వాడి కేంద్రంలో ‘మన ఊరు – మన అంగన్వాడి’ నినాదంతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మస్కూరి కాశరం పాల్గొని అంగన్వాడి కేంద్రాల ప్రాధాన్యతను వివరించారు. చిన్నారులను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త మంగినపల్లి పద్మ, ఆయా లక్ష్మి, విద్యార్థుల తల్లులు మరియు గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు.






