13 June, 2026 | 10:46 PM

ఏజెన్సీలో ఈదురు గాలుల వర్షం.. నిలిచిపోయిన రాకపోకలు.

13-06-2026 09:51 PM

* ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట్ అడవిలో రాధారిపై కూలిన చెట్లు..

ఉట్నూర్, జూన్ 13( విజయ క్రాంతి ): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో శనివారం సాయంకాలం సమయంలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఈదురు గాలులతో  చెట్లు కూలిపోయాయి. ఉట్నూర్ మండలంలోని  బిర్సాయిపేట గ్రామ సమీపంలోని అడవిలో ఉట్నూర్  మంచిర్యాల రహదారిపై ఎనిమిది చెట్లు కూలి కూలిపోయి రోడ్డుపై  విరిగిపడ్డాయి. రహదారిపై విరిగిపడ్డ చెట్లను తొలగించే వరకు  దాదాపు గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలులతో  పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా ను పునరుద్దించుటకు విద్యుత్ శాఖ సిబ్బంది  విద్యుత్ లైన్ల వెంట తిరిగి  మరమ్మతులు చేశారు.