రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
13-06-2026 09:36 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేసముద్రం పట్టణానికి చెందిన భూక్యా నవీన్ (21) దుర్మరణం పాలయ్యాడు. బైక్ పై వెళ్తుండగా అతన్ని టిప్పర్ ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సంఘటన స్థలికి మహబూబాబాద్ పట్టణ పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






