30 May, 2026 | 7:32 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరిత   •   సీఎం రేవంత్ రెడ్డికి చేరిన సిద్ధాపూర్ డంప్ యార్డ్ వ్యవహారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆనందం   •   బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి   •   ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే   •   వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని   •   అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుంది   •   మహిళా శక్తి సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తాం   •   మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి   •   విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు ఎంపీడీవో   •  

బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి: కలెక్టర్ అంకిత్

30-05-2026 06:50 PM

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మాక్ పార్లమెంట్ నిర్వహణ

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా వారోత్సవాలు పురస్కరించుకొని శనివారం ఐడీఓసీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కౌమారదశ బాలికలతో మాక్ పార్లమెంట్  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై బాలికలు నిర్వహించిన మాక్ పార్లమెంట్‌ను పరిశీలించారు. బాల్య వివాహాల నిర్మూలన, మహిళల భద్రత, మహిళా హక్కులు, విద్య ప్రాధాన్యత వంటి అంశాలపై బాలికలు నిర్వహించిన చర్చలను అభినందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ ద్వారా బాలికలకు పార్లమెంటరీ వ్యవస్థ, చట్టసభల పనితీరు, ప్రశ్నోత్తరాల సమయం, బిల్లుల ప్రవేశపెట్టడం, చట్టాల రూపకల్పన వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మహిళా సాధికారత, ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళల పాత్ర, సామాజిక బాధ్యతలు, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు నిర్వహించారు. బాల్య వివాహాల నిర్మూలన, మహిళల భద్రత, మహిళా హక్కులు, సమాజ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం వంటి కీలక అంశాలను మాక్ పార్లమెంట్‌లో ప్రస్తావించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ... బాలికల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, నిర్ణయ సామర్థ్యం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశ బాలికల కోసం ప్రత్యేకంగా 529 స్నేహ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం బాలికలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజుతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామాలు, సమాజంలో ఎదురవుతున్న వివిధ సమస్యలపై బాలికలు ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సరఫరా వల్ల యువత, కుటుంబాలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలు, బెల్ట్ షాపులు, గుడుంబా వంటి మద్యపాన వ్యసనాల కారణంగా చిన్న వయస్సులోనే యువత బానిసలుగా మారుతున్న పరిస్థితులు, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా అపరిచితులతో పరిచయాల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న బాల్య వివాహాల సమస్యలపై చర్చ జరిగింది.

ఈ అంశాలపై ఎస్పీ బాలికలకు చట్టపరమైన నిబంధనలు, భద్రతా చర్యలు, జాగ్రత్తలపై సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కులు, బాలలపై హింస మరియు గృహహింస నివారణ, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. సమాజంలో బాలికలు ధైర్యంగా ముందుకు సాగేందుకు, తమ హక్కులను తెలుసుకొని వినియోగించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు .