ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గత సంవత్సరం వర్షాకాలంలో ఇల్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. మంగళవారం ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాలని ముగ్గులు పోసి న దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు, వివో యాదగిరి వారికి ప్రోస్డింగ్ కాపీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం ద్వారా లబ్ధిదారులు పనియాల కవిత మిగతా ఇద్దరు లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి, ఇన్చార్జి మంత్రి సీతక్కకు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గోపాల్ రెడ్డి, మర్రి శేఖర్ రాములు, అబ్రబోయిన రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






