ప్రతి విద్యార్థి పాఠశాలలో రాగి జావా తీసుకునే విధంగా చూడండి
బోథ్,(విజయక్రాంతి): పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో ముందు ఉంటారని వారికి ప్రభుత్వ పరంగా అందిస్తున్న రాగి జావా ప్రతి విద్యార్థి తీసుకునే విధంగా ప్రధాన ఉపాధ్యాయులు చూడాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశిష కోరారు. బుధవారం కొనాల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు . సరియైన పౌష్టికాహారం తీసుకోక పోవడం వల్ల చిన్న వయసులోనే వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఆడపిల్లల్లో రక్తహీనత అధికంగా ఉంటుందని , విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోకపోవడంతో వ్యాధుల బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు.
ప్రభుత్వము అందించే రాగిజావలు అనేక రకాలైన పోషకాలు ఉన్నాయన్నారు. సెంట్రల్ లైట్స్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం రాగి జావా అందించడం జరుగుతుందన్నారు .రానున్న అక్టోబర్ నెల నుండి బ్రేక్ ఫాస్ట్ ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చిప్స్ వంటి వాటిని తినడం వల్ల లాభం లేదని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఆంగ్లం నేర్చుకోవాలని కోరారు. మత్తు పదార్థాలకు బానిస అయితే చదువులకు దూరం అవుతారని దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆశించిన లక్ష్యం సాధించలేక పోతారు అన్నారు. మహనీయుల జీవిత విశేషాలను విద్యార్థులు తెలుసుకొని వారి మార్గంలో నడిచే విధంగా ఉపాధ్యాయులు బోధించాలన్నారు.
క్రమశిక్షణతో కూడిన జీవనశైలి పరచుకుంటే భవిష్యత్తులో రాణిస్తారు అన్నారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని వాటిని చదువు కోసం మాత్రం ఉపయోగించుకోవాలన్నారు.రీల్స్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని, సూచించారు. పాఠశాల అభివృద్ధికి డిఆర్ఓ సహకారంతో న్యూట్రి గార్డెన్, కాంపౌండ్ వాల్ ,కిచెన్ సెట్, నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అంతేగాక మండలంలో నూతన ఎమ్మార్వో ఎంపీడీవో ఆఫీస్ ల నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామన్నారు .అనంతరం పాఠశాలలో గ్రంథాలయం న్యూట్రి గార్డెను ప్రారంభించి మొక్కలు నాటారు.
పాఠశాలలో విద్యార్థుల కంప్లైంట్ బాక్స్ ఫిర్యాదును పరిశీలించి చర్యల నిమిత్తం ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాళ్ళ బిందుజ జిల్లా విద్యాధికారి మాధవి, పిడి రాథోడ్ రవీందర్, తాసిల్దార్ మల్లేష్ ఎంపీడీవో రత్నాకర్ రావు మండల విద్యాధికారి మహమ్మద్, మాజీ ఎంపీపీ విడిసి అధ్యక్షులు తుల శ్రీనివాస్ ఉప సర్పంచ్ శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గాజులపోకన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు సచిన్ శర్మ, విద్యా కమిటీ చైర్మన్ గాజుల లక్ష్మి యోగా శిక్షకురాలు మునిగేలా యోగిత ,పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






