20 April, 2026 | 6:05 PM

ఘనంగా చౌడాలమ్మ–బీరప్ప పట్నాల మహోత్సవం

20-04-2026 04:38 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో శ్రీ కృష్ణ యాదవ కుర్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ చౌడాలమ్మ–బీరప్ప పట్నాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మి నరసింహరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో కలిసి దేవతలకు పూజలు సమర్పించి, ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచులు వంకాయల గౌతమి, బొజ్జ మల్లేశం, స్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు బెదిరే దేవయ్య, సీనియర్ నాయకులు వంశీరావు, గోపు పరశురాములు, శివతేజ, భూమ్ రెడ్డి, ప్రసాద్, శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, శంకర్ తదితరులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.