7 August, 2026 | 7:58 PM

చింతల శ్రీను తనయుడు రాజు జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

07-08-2026 06:39 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సమాజ సేవే చిరస్మరణీయమైన నివాళి అని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం  సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీకి చెందిన కీర్తిశేషులు  రాజు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 8వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, నోట్‌బుక్స్, ఇతర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

అనంతరం స్థానిక వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడి వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, 8వ వార్డు కౌన్సిలర్ చింతల రాజు మాట్లాడుతూ... కీర్తిశేషులు  రాజు సేవా భావాన్ని స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఆదర్శప్రాయమని కొనియాడారు.

విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం, వృద్ధులను ఆదరించడం వంటి కార్యక్రమాలు సమాజంలో సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, కీర్తిశేషులు  రాజు ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి ఏడాది ఆయన జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిలుక రాజేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ ప్రముఖులు, అభిమానులు పాల్గొని కీర్తిశేషులు  రాజుకు ఘనంగా నివాళులర్పించారు.