చిన్నారులపై చీపురుతో దాడి
జగిత్యాల హాస్టల్‌లో అమానుషం బయటపడింది
కోరుట్ల, మార్చి30 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలోని ఎస్టీ సంక్షేమ హాస్టల్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది, హా స్టల్లో కూరగాయలు కోసే వ్యక్తిగా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి విద్యార్థులను చీపురుతో చితక బాదిన సంఘటన తీవ్ర ఆగ్ర హానికి దారితీసింది స్థానికుల సమాచారం ప్రకారం శ్రీనివాస్ నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతూ గత నాలుగు నెలలు గా హాస్టల్లోని విద్యార్థులను వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
చిన్నారులని కూడా చూడకుండా చీపురుతో కొట్టిన ఘటన హాస్టల్లో భయానక వాతావరణాన్ని సృష్టించింది ఈ విషయంపై విద్యార్థులు పలుమార్లు హాస్టల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటిచర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. దీంతో నిర్వాహకుల నిర్లక్ష్యంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.




