108 అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లి, శిశువు సురక్షితం
ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని సింగారం గ్రామానికి చెందిన మడకం భీమి రెండోవ కాన్పు ప్రసవ వేదనలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పరమ సునీల్ కుమార్ , భాగ్యమ్మే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోని గర్భిణి స్త్రీ ని పరీక్షించగా ఆమెకు తీవ్ర ప్రసవ వేదనలు ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే ఆమెను అంబులెన్స్ లో తీసుకుని వైద్య పరీక్షలు చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మడకం భీమీ ప్రసవ వేదనలు ఎక్కువ కావడంతో అంబులెన్స్లోనే ప్రసవించింది. సురక్షితంగా పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండగా, అనంతరం సమీప ఆళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో చాకచక్యంగా స్పందించిన పైలెట్ సునీల్ కుమార్ ఈ యం టి భాగ్యమ్మ లను స్థానికులు అభినందించారు.






