31 August, 2026 | 4:31 AM

ఆటోను ఢీకొన్న కోళ్ల వ్యాన్.. ఒకరు మృతి

31-08-2026 12:00 AM

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మేడిపల్లి 

చొప్పదండి, ఆగస్టు 30 (విజయ క్రాంతి): గంగాధర మండలం మధురానగర్లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగపేట గ్రామానికి చెంది న లింగాల దేవమ్మ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాద విషయం తె లుసుకున్న వెంటనే చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు.