28 March, 2026 | 8:55 PM

చేగుంట తైబజార్ వేలం

28-03-2026 06:46 PM

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట గ్రామ పంచాయతీలో 2026-27 సంవత్సరానికి గాను శనివారం తై బజార్ వేలం పాట నిర్వహించారు. సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ వేలంలో పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.

హోరాహోరీగా సాగిన ఈ పాటలో చింతల భూపాల్ అనే వ్యక్తి రూ.24,50,000కు వేలం దక్కించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పంచాయతీకి మంచి ఆదాయం సమకూరిందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ మాట్లాడుతూ  వేలంలో వచ్చిన డబ్బును పాలకవర్గంలో చర్చించి పట్టణాభివృద్ధికి మౌలిక వసతులు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు.