28 March, 2026 | 8:59 PM

30న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు

28-03-2026 06:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్టు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా నిరసన నిర్వహిస్తున్నట్టు ఐఎఫ్టి జిల్లా కార్యదర్శి రాజన్న తెలిపారు. శనివారం పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కార్మికులందరూ ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రమేష్ నాగరాజు తదితరులు ఉన్నారు