21-02-2026 07:50:44 PM
భైంసా,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారని వారి సేవలను గుర్తించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది అన్నారు. ఉద్యమకారులకు ప్రభుత్వ పెన్షన్ ఇవ్వాలని, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. ఎన్నికల్లో ప్రభుత్వం హామీ ఇచ్చినందున వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.