21-02-2026 07:44:10 PM
జిల్లా ఎస్పీ
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఆదివారం రోజున గంభీరవుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి, మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. పర్యటన దృష్ట్యా గంభీరవుపేట మండలంలో ఏర్పాట్లను, హెలిప్యాడ్ ను ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ అనిల్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.