3 June, 2026 | 5:58 PM

పవన్‌ కల్యాణ్‌ని తెలంగాణలో అడ్డుకోవడం కరెక్ట్ కాదు

03-06-2026 05:00 PM

అమరావతి: తెలంగాణలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమం(Pawan Kalyan meeting ) అడ్డుకోవడం సరికాదని సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తెలిపారు. ప్రజలకు మంచి చేయడంలో నాయకులు పోటీ పడాలని,ప్రజల మధ్య విభేదాలు తెచ్చేందుకు నేతలు పోటీపడకూడదని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

తాను కూడా ఇటీవల తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశానని చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్ఎస్‌ యూనిట్‌ పెట్టిందని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అయ్యిందన్న చంద్రబాబు ఎవరెవరు ఏం చేశారు ప్రజలకు తెలుసన్నారు. లాజికల్‌గా ముందుకెళ్లాలి తప్ప.. ప్రశాంత వాతావరణం చెడగొట్టడం సరికాదని ఏపీ సీఎం స్పష్టం చేశారు.