5 May, 2026 | 6:26 PM

Breaking News

అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •   ఆయిల్ ఫాం సాగుకు రైతులు ముందుకు రావాలి: కలెక్టర్ హరిత   •   పండుగలు వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి   •   రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలి   •   కొత్తరకం పంటలపై రైతాంగానికి అవగాహన కల్పిస్తాం   •   కొమ్ముగుడెంలో సిసి రోడ్లు ప్రారంభించిన సోయం వీరభద్రం   •   జనాభాగణాలపై ముగిసిన శిక్షణ   •   నవోదయకు విద్యార్థి ఎంపిక   •   గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు   •   అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ చిత్రపటానికి పాలాభిషేకం   •  

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ లక్ష్మీనరసింహారావు

04-03-2026 07:59 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఎగదండి బాబు, నరసవ్వ (బుజ్జవ్వ) దంపతులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుమార్తెలు మమత, స్వప్న, శ్వేత, సిందుజలు అనాథలయ్యారు. ఈ విషాద ఘటనను తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీనరసింహారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ తనవంతు సహాయంగా ఆర్థిక సాయం అందించారు.భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి వెంట సర్పంచులు నాగరాజు, స్వామి, అరవింద్‌తో పాటు సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, రామ్మోహనరావు, భూమారెడ్డి, కాశవేని మహేష్, వంగల శ్రీనివాస్, బాబు, సుమన్, రవి, శ్రీనివాస్, అన్వేష్, రంజిత్, పర్షరాములు, గణేష్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.