నవోదయకు ఎంపికైన చైతన్య విద్యానికేతన్ విద్యార్థిని
18-03-2026 12:00 AM
భిక్కనూర్, మార్చి17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని చైతన్య విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థిని నాగారం అక్షర 2026 సంవత్సరానికి జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ రేణు కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేకంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. హెడ్మాస్టర్ అశోక్ యాదవ్తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించి ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. విద్యార్థిని సాధించిన ఈ విజయంతో పాఠశాలకు గౌరవం తీసుకువచ్చిందని వారు తెలిపారు.




