26 July, 2026 | 2:02 PM

రేపు లోక్‌సభలో పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం

26-07-2026 12:59 PM

న్యూఢిల్లీ: పరీక్షల్లో అక్రమాలను అరికట్టే చర్యలను బలోపేతం చేసే లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026'ను ప్రవేశపెట్టనుంది. నీట్ యూజీ-2026(NEET-UG 2026) ప్రశ్నపత్రం లీక్ వివాదం నేపథ్యంలో సంస్కరణల కోసం మళ్లీ డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో, అలాగే జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) తన నిరసనను విరమించిన కొద్ది గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభ శాసన కార్యకలాపాల అజెండా ప్రకారం 'పబ్లిక్ పరీక్షలు చట్టం, 2024'కు సవరణలను ప్రతిపాదించే బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టనున్నారు. 

సీజేపీ ప్రతినిధులతో జరిగిన మూడవ విడత చర్చల అనంతరం, పరీక్షా విధానంలో సంస్కరణలు కోరుతూ ఆ ప్రతినిధి బృందం ఐదు అంశాలతో కూడిన ఒక ప్రతిపాదనను, లిఖితపూర్వక విజ్ఞప్తిని సమర్పించిందని కేంద్ర మంత్రి జె.పి. నడ్డా తెలిపారు. శనివారం డ్రాఫ్ట్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా చట్టంలో కీలక సవరణలు, ఆ బిల్లును ప్రవేశపెట్టే అంశానికి లోబడి, దానిని పరిశీలనలోకి తీసుకుని సభ ఆమోదించాలని సింగ్ ప్రతిపాదిస్తారని కూడా ఆ అజెండా పేర్కొంటోంది. సాధారణ అక్రమాలను పాల్పడితే 5 నుంచి 10 ఏళ్లకు జైలు శిక్షపెంచుతూ రూ.50 లక్షల వరకు జరిమానా విధించినున్నట్లు  కేంద్రం వెల్లడించింది. వ్యవస్థీకృత ముఠాలు, పేపర్ లీక్ గ్యాంగ్ లకు గరిష్ఠంగా రూ.10 కోట్లు వరకు భారీ జరిమానా విధించాలని సీజేపీ డిమాండ్ చేశారు.