26 July, 2026 | 2:19 PM

మృతుల కుటుంబాలకు అండగా మాజీ జెడ్పీటీసీ జగన్ మోహన్ రావు

26-07-2026 01:33 PM

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన నాగినేని

ముత్తారం,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలను మాజీ జెడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగినేని జగన్ మోహన్ రావు ఆదివారం పరామర్శించారు. ముందుగా ఎస్టీ కాలనీకి చెందిన పోలం మల్లక్క నివాసానికి వెళ్లిన ఆయన, మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతురాలి భర్త పోలం పోశాలకు రూ.2,000 ఆర్థిక సహాయం అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

అనంతరం గ్రామానికి చెందిన శీలం అశోక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని కూడా  జగన్ మోహన్ రావు పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోల్నేని బుచ్చంరావు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి చంద్రమౌళి గౌడ్, మాజీ ఎంపీటీసీ శీలం తిరుపతి, నాయకులు కేవీ. చారి, రెండో వార్డు సభ్యులు కోలిపాక లక్ష్మీ చంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు బిక్కినేని కర్ణాకర్ రావు, దేవునూరి సదానందం తదితరులు పాల్గొన్నారు.