పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్
26-07-2026 01:26 PM
పెంచికల్పేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎలుక పల్లి గ్రామంలో ఆదివారం ఉదయం ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎనిమిది వందల యాభై లీటర్ల గుడుంబా పానకం 8 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. గుడుంబా దాడి జరిగిన ప్రదేశం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం. అదేవిధంగా ఎటువంటి పత్రాలు లేనటువంటి 10 బైకులను సీజ్ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికి కార్డెన్ సర్చ్ నిర్వహిస్తుంటామని ఆయన తెలిపారు. ఈ సెర్చ్ లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






