‘చీకటా’యపాలెంలో చైన్ స్నాచింగ్స్
16-05-2026 01:47 AM
మహబూబాబాద్, మే 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంలో గురువారం రాత్రి మూడు చోట్ల మహిళల మెడలో నుండి బంగారు గొలుసులు లాక్కెళ్ళిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున రెండు గంటల వరకు మూడు చోట్ల ఆరు బయట నిద్రిస్తున్న మహిళల మెడలోనుండి 9 తులాల బంగారు పుస్తెల తాళ్లు, నల్లపూసలగొలుసులు లాక్కెళ్లారు. ఒకే రాత్రి మూడు చోట్ల దొంగతనాలు జరగడం పట్ల గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. సిసి టీవీలను పరిశీలిస్తూ, అన్ని కోణాల్లో చోరీ ఘటన చేదించడానికి చర్యలు చేపట్టారు.






