9 May, 2026 | 10:23 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

హెచ్‌పీవీ టీకాతో గర్భాశయ క్యాన్సర్ నివారణ

09-03-2026 12:08 AM

తుంగతుర్తి, మార్చి 8: గర్బాశాయ కాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా హెచ్ పి వి టీకాను ఆదివారం ఏరియా హాస్పిటల్ తుంగతుర్తి లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో తుంగతుర్తి సర్పంచ్ సాయి బాబా లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమంని 14 సంవత్సరాల ఆడపిల్లలు విధిగా వేయించుకోవాలని, భవిష్యత్ లో గర్భశాయ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం భవిష్యత్ స్త్రీ జాతికి గర్భశాయ క్యాన్సర్ రాకుండా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తదుపరి సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఈ వాక్సిన్ అన్నీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్ లో 14 సంవత్సరాల బాలికలకు వేస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీని వాళ్ళ ఎలాంటి సైడ్ ఎఫెకట్స్ ఉండవని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ ప్రియ, డాక్టర్ సాయి అశ్విని, డాక్టర్ లింగమూర్తి, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ నాగమణి, ఫార్మసిస్ట్ శోభ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.