10-02-2026 03:05:06 PM
హైదరాబాద్: విశాఖపట్నం మెట్రోకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడలో మెట్రోకు సంబంధించిన ప్రతిపాదనలు ఏపీ ప్రభుత్వం పంపించింది. వాటిని పరిశీలించిన కేంద్రం విశాఖ మెట్రోకు పచ్చజెండా ఊపినట్లు కేంద్ర మంత్రి స్వయంగా చంద్రబాబుకు ఈ సమావేశంలో చెప్పారు. దీంతో ఆయన మంత్రి మనోహార్ లాల్ కు ధన్యవాదాలు తెలిపారు.