calender_icon.png 10 February, 2026 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినిని ప్రేమించి.. రహస్యంగా పెళ్లిచేసుకున్న ఫిజిక్స్ ఉపాధ్యాయుడు

10-02-2026 03:32:10 PM

హైదరాబాద్: నేటి సమాజంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విచక్షణ కోల్పోతున్నారు. పిల్లలకు పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాలనే కాకుండా విధ్యార్థినీలకు ప్రేమ పాఠాలు కూడా నేర్పిస్తున్నారు. తాజా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పోచారం డివిజన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని పర్రే మైటీన్ (27) అనే ఫిజిక్స్ ఉపాధ్యాయుడు మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశాడు.

అక్కడితో ఆగకుండా విద్యార్థినిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే 20 రోజుల కిందట బాలిక తల్లి విద్యార్థిని మెడలో పసుపు తాడు ఉండటం చూసి ప్రశ్నించింది. విద్యార్థిని జరిగిన విషయం మొత్తం తల్లి వివరంగా చెప్పడంతో, పాఠశాల నిర్వాహకులను బాలిక కుటుంబ సభ్యులు నిలదీశారు. వారి నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పర్రే మైటీన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.