ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు
* పాత పేరుతోనే కొనసాగించాలి
* ఫేస్ క్యాప్చర్ హాజరు తీసివేయాలి
పోకల వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని గానుబండ గ్రామంలో వ్యవసాయ కార్మిక సంగం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో కొట్లాడి అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరును జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి పెట్టడం జరిగిందని, దానిని ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తొలగించి కొత్తగా జీ రామ్ జీ పెట్టడం సిగ్గు సేటు అని అన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం దారుణం అని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత,గత ప్రభుత్వాలు, ప్రభుత్వ పథకాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టి గౌరవించడం జరిగిందని,ఈ ప్రభుత్వం అట్టి పేర్లన్నీ తొలగించి, బిజెపి ప్రభుత్వం తన కిష్టమైన పేర్లను పెట్టి ఆనంద పడుతోందని, పథకాలకు పేర్లను తొలగించినంత మాత్రాన వారి స్థాయి పడిపోదని, ప్రజల మనసులలో వారు చిరస్థాయిగా నిలిచిపోతారని దానిని బిజెపి ప్రభుత్వం గ్రహించాలని ఆయన అన్నారు.
ఉపాధి హామీ కూలీలకు పేస్ క్యాపిటల్ విధానం పెట్టడం వలన సైట్ లేక చాలామంది ఫేస్ క్యాప్చర్ గాక గంటల తరబడి బేసిక్స్ చూడాలి వస్తున్నదని కావున దీనివలన ఉపాధి కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నందున వెంటనే తొలగించి గతంలో మాదిరిగానే మస్ట్లర్ల ద్వారా హాజరు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య,గ్రామ సర్పంచ్ కడియాల పద్మ, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు తాళ్ల తిరుపయ్య,ఈద నాగరాజు,పంగ ఏదయ్య,మెండే వెంకటేశ్వర్లు, గుండెబోయిన లింగయ్య, కనకయ్య, చిక్కుల్ల సావిత్రి,పిచ్చయ్య,నాగమణి,పద్మ,ఉపేంద్ర, సైదమ్మ, ఎంకమ్మ,తదితరులు పాల్గొన్నారు






