ఎర్రగడ్డలో శ్మశానవాటిక చిచ్చు
- ఎంపీ రఘునందన్‌రావును అడ్డుకున్న పోలీసులు
- బ్రిగేడ్ సీటాడెల్ సమీపంలో స్థలం కేటాయింపును వ్యతిరేకిస్తూ స్థానికుల నిరసన
- బీజేపీ నేతల మద్దతు.. పోలీసులతో వాగ్వాదం, ఉద్రిక్తత
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ అపార్ట్‌మెంట్ వెనుకవైపు ప్రభుత్వం శ్మశానవాటిక కోసం స్థలాన్ని కేటాయించడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావును, ఇతర బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిం ది.
ఎర్రగడ్డలోని బ్రిగేడ్ సీటాడెల్ అపార్ట్‌మెంట్ వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని ప్రభుత్వం ఇటీవల శ్మశానవాటిక నిర్మాణం కోసం కేటాయించింది. నివాస సముదాయానికి అత్యం త సమీపంలో శ్మశానవాటిక ఏర్పాటు చేయడాన్ని అపార్ట్‌మెంట్‌వాసులు తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వారు నిరసన చేపట్టారు.ఈ విష యం తెలుసుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు, ఇతర బీజేపీ నాయకులు ఆందో ళనకారులకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు.
ప్రభుత్వం కేటాయించిన వివా దాస్ప ద స్థలంలోకి వారు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి వారిని నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య స్వల్ప వాగ్వా దం చోటుచేసుకుంది. పోలీసుల చర్యతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం స్పందించి, ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని స్థానికు లు, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.




