ఉద్యమకారుల సంబరాలు
18-05-2026 05:21 PM
భైంసా,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యమకారులు సోమవారం సంబరాలు జరుపుకున్నారు. టీఎన్జీవో కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కొట్టే శేఖర్ ఉద్యమకారులు డాక్టర్ జగన్, రామకృష్ణ గౌడ నిర్మల్ గద్దర్ షరీఫ్, డాక్టర్ వినోద్, బొల్లోజీ నర్సయ్య, సామల వీరయ్య, దొంతుల చంద్రశేఖర్, కూన భూమేష్,అంగ జగదీశ్, ఎం. శంకర్, కటికే శివాజీ తదితరులు పాల్గొన్నారు.






