20 August, 2026 | 7:55 PM

కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ను పరిశీలన

20-08-2026 06:55 PM

రుద్రంగి ఆగష్టు 20(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సూరమ్మ ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు కుటుంబానికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని అలాగే చట్టబద్ధంగా వారికి రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా చాలా కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది అని వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుత మార్కెట్ విలువ అనుసరించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగడం మూడు సంవత్సరాలు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు.  సురమ్మ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని రైతులకు వ్యవసాయనికి ఇబ్బంది అవుతుందని అన్నారు. ప్రాజెక్ట్ పనులు వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని. లేని పక్షంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుతాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కట్కూరి రమేష్, రుద్రంగి మండల అధ్యక్షుడు దయ్యాల ఉదయ్, మండల ఉపాధ్యక్షుడు ఏనుగందుల సతీష్,ప్రధాన కార్యదర్శి లింగాల రవీందర్,కోశాధికారి లింగంపెల్లి సుదర్శన్, సీనియర్ నాయకులు కదాసు మహేందర్, కట్కూరీ హనోక్, తదితరులు పాల్గొన్నారు