20 August, 2026 | 6:49 PM

కార్మిక హక్కులు చట్టాల రక్షణకై పోరాటాలకు సిద్ధం

20-08-2026 06:35 PM

కార్మిక హక్కులు చట్టాల రక్షణకై పోరాటాలకు సిద్ధం

సుల్తానాబాద్, ఆగస్టు 20 (విజయ క్రాంతి): కార్మికుల హక్కులు, చట్టాల రక్షణకై సమరశీల పోరాటానికి సిద్ధం కండి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ పిలుపునిచ్చారు, గురువారం పెద్దపెల్లి జిల్లా ఏఐటీయూసీ నాలుగవ మహాసభ  సుల్తానాబాద్ ఐబి గెస్ట్ హౌస్ నుండి భారీ కార్మిక ప్రదర్శన బయలుదేరి యశోద నరహరి ఫంక్షన్ హాల్ వరకు సాగింది, అనంతరం అమరవీరులను స్మరిస్తూ ఎర్రజెండాను ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్ బాలరాజు  ఆవిష్కరించారు. ..అనంతరం జరిగిన మహాసభకు అధ్యక్ష వర్గముగా కామ్రేడ్ వైవి రావు.

కామ్రేడ్ పూసల రమేష్ వ్యవహరించగా.. ముఖ్యఅతిథులుగా హాజరైన కలవేన శంకర్ , కామ్రేడ్ బాలరాజులు మాట్లాడుతూ.. కార్మిక ఉద్యోగ హక్కుల రక్షణకై చట్టాల అమలుకై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు , పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని దుయ్యబట్టారు, ఈ సభలో ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ మెంబర్ మారగోని ప్రవీణ్ కుమార్, .సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, గౌతమ్ గోవర్ధన్, రామగుండం సిపిఐ కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య. అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ నాంసాని శంకర్, రెడ్డపాక లక్ష్మణ్, కే రాజరత్నం, ఎం ఆర్ సి రెడ్డి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి యజ్జ రాజయ్య బృందం విప్లవ అమరుల పాటలు ఆలపించగా కార్మికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి