20 August, 2026 | 6:56 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు బీఎస్పీ మద్దతు

20-08-2026 06:30 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు బీఎస్పీ మద్దతు 

హుజూరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు గురువారం ఐదో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్ సందర్శించి జర్నలిస్టుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా జర్నలిస్టులు నల్ల బెలూన్లు ఎగురవేసి వినూత్న నిరసన తెలిపారు. “మా స్థలాలు మాకు ఇవ్వాలి.. మా హక్కులు కాపాడాలి” అంటూ నినాదాలు చేశారు. ముదిరాజ్ సంఘం నాయకులు కొలిపాక సమ్మయ్య, బీఎస్పీ నాయకులు, ప్రెస్‌క్లబ్ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.