కెరమెరిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి
వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి జాతీయ మానవ హక్కుల కమిటీ వినతి
ఆసిఫాబాద్(విజయక్రాంతి): కెరమెరి మండల కేంద్రంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగుల సౌకర్యార్థం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
కేరమేరీ మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు డయాలసిస్ చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, స్థానికంగా డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తే పేద రోగులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని వివరించారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించి, రాష్ట్ర హెల్త్ కమిషనర్ క్రిస్టియానా చోగ్తూ దృష్టికి అంశాలను ఫార్వర్డ్ చేసినట్లు తెలిపారు.






