19 August, 2026 | 7:04 PM

29న ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నా విజయవంతం చేయాలి

19-08-2026 06:10 PM

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఈనెల 29న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణా సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు కామెర గట్టయ్య, ప్రజా ఫ్రంట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పీక కిరణ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక గోడ పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగం కల్పించిన సంక్షేమ విధానాలను విస్మరిస్తూ కొనసాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తారని అన్నారు.

మనదేశంలో ఐదు, ఆరు శతాబ్దాలుగా ప్రజలు జీవించే హక్కు జీవనోపాధి హక్కుల కోసం బలమైన పోరాటాలను ప్రధానంగా అడవులు అడవి చుట్టూ ఉన్న మైదాన ప్రాంతాలు కేంద్రంగా మారాయని, నిర్దిష్ట రాజకీయ దృక్పథంతోనే ఉద్యమాలు కొనసాగాయని లక్షలాది ఆదివాసులు జల్ జంగల్ జమీన్ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారని అన్నారు. రాజకీయాల ప్రభావం వలన వ్యక్తిగత స్వార్ధాలు లేకుండా సామాజిక ప్రయోజనాల కోసం, మార్పు కోసం అనేక మంది ఉద్యమకారులు రాజకీయ కార్యకర్తలు ఇప్పటికే వేలాదిగా ప్రాణాలు వదిలారని అంతేకాకుండా రాజకీయ పార్టీలు సంస్థలకు మావోయిస్టు పార్టీకి చెందిన వేలాది రాజకీయ కార్యకర్తలు దేశంలో జైల్లో మగ్గుతున్నారని అన్నారు.

రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని, ప్రజాసంఘాల నాయకులపై మేధావులపై ముస్లిమ్, మైనారిటీలు, తెలంగాణ ఉద్యమకారులపైన నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఉపచట్టాన్ని రద్దు చేయాలి డిమాండ్ చేస్తూ ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు పోరాటం వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, ప్రజా ఫ్రంట్ దుబాసి పార్వతి, విద్యావంతుల వేదిక రాదండి దేవేందర్, అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య అయిత బాపు తదితరులు పాల్గొన్నారు.