ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు
బోథ్,(విజయక్రాంతి): నిరుద్యోగ యువకునికి ఉద్యోగం ఇప్పిస్తానని మోసానికి పాల్పడిన నిర్మల్ జిల్లాకు(Nirmal District) చెందిన పాలంకరణ గంగాధర్ అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్ పంపించినట్లు బోత్ సిఐ గురుస్వామి పేర్కొన్నారు. మండలంలోని పొచ్చెర గ్రామానికి చెందిన అల్లాడి రాకేష్ అనే యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని 20వేల రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాడని సీఐ తెలిపారు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అని పేర్కొంటూ తనను మోసం చేశాడని అల్లాడి రాజేష్ ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీంతో కేసు నమోదు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది అన్నారు ఉద్యోగాల పేరుతో డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని మోసపోతే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు కార్యక్రమంలో ఎస్సై వి పురుషోత్తం సిబ్బంది ఉన్నారు






