28 May, 2026 | 12:50 PM

తాండూరులో ఘనంగా బక్రీద్

28-05-2026 11:51 AM

ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే. 

తాండూరు, మే 28,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని పెద్దెముల్, బషీరాబాద్, తాండూర్ , యాలాల మండలాలతో పాటు మున్సిపల్ పరిధిలో బక్రీద్ పండుగ ఘనంగా జరిగింది. తాండూర్ పట్టణంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు ఎమ్మెల్సీ, మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఇంకా ఈ వేడుకల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు  పాల్గొన్నారు.