Karnataka politics: మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా: సిద్ధరామయ్య
బెంగళూరు: కర్నాటకలో రాజకీయ(Karnataka Politics) పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటకలో అధికార కాంగ్రెస్(Karnataka Congress) ప్రభుత్వంలో నాయకత్వ మార్పిడి జరుగుతోంది. ''మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు.. మీ అందరి సహకారానికి కృతజ్ఞతలు.'' అంటూ సిద్ధరామయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మంత్రులకు తెలిపారు.
సిద్ధరామయ్య స్థానంలో సీఎంగా డీకే శివకుమార్(DK Shivakumar as CM) కు లైన్ క్లియర్ అయింది. తనకు సహకరించిన అందరికీ సీఎం సిద్ధరామయ్య కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి పదవి నుండి తన నిష్క్రమణపై ఊహాగానాల నడుమ సిద్ధ రామయ్య(Siddaramaiah) తన మంత్రివర్గ సహచరులకు అల్పాహార విందు ఇచ్చారు. డీకే శివకుమార్, ఇతర మంత్రివర్గ సహచరులు అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో డీకే శివకుమార్ కు సిద్ధ రామయ్య శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి కార్యాలయం(Chief Minister's Office) పంచుకున్న ఒక చిత్రంలో సిద్దరామయ్య శివకుమార్‌ను ఆలింగనం చేసుకోవడం కనిపిస్తుంది. మరొక చిత్రంలో, ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న శివకుమార్, సిద్దరామయ్య పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకోవడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపే అవకాశముంది. మంత్రివర్గాన్ని రద్దు చేసి కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు డీకే వర్గం పేర్కొంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే ఒప్పందం కుదిరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.






