28 May, 2026 | 12:22 PM

సీఎం రేవంత్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు

28-05-2026 11:21 AM

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఈద్ అల్-అధా(Eid al-Adha) (బక్రీద్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, ప్రేమ, దయ, సహనం అనే మహత్తర విలువలను గుర్తు చేసే ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, ఐక్యతను నింపాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. భగవంతుడి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి కలగాలని కోరుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ 'బక్రీద్' శుభాకాంక్షలు తెలిపారు.