27 April, 2026 | 4:02 AM

తండ్రిని గౌరవించలేరా?

27-04-2026 02:14 AM

ఆవుల రవీందర్ రెడ్డి

సికింద్రాబాద్, ఏప్రిల్26 (విజయక్రాంతి): తండ్రిని గౌరవించలేని వ్యక్తి తెలంగాణ ప్రజలను ఎలా గౌరవిస్తారని ఆవుల రవీందర్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని స్థాపించిన అనంతరం, గౌరవ తెలంగాణ జాతిపితగా భావించే కేసీఆర్‌ని గౌరవించకుండా మాట్లాడటం పట్ల తెలంగాణ సమా జం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కవిత మాటలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆవుల రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు.