2 July, 2026 | 1:17 AM

కెనరా బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం

02-07-2026 12:10 AM

నిజామాబాద్ రీజినల్ కార్యాలయంలో వేడుకలు

హైదరాబాద్, జూల్ 1 (విజయక్రాంతి): కెనరా బ్యాంక్ 121వ వ్యవస్థాపక దినోత్సవం నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రాంతీయ ప్రధాన అధికారి (ఏజీఎం) కె. వినోద్ బాబు, డివిజనల్ మేనేజర్లు, ప్రాంతీయ కార్యాలయ అధికారులు, సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

121 సంవత్సరాలుగా కెనరా బ్యాంక్ దేశ ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తూ, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలను అందిస్తూ, రైతులు, వ్యాపారవేత్తలు, మహిళలు, యువత, ప్రతి వర్గ ప్రజల అభివృద్ధికి అంకితభావంతో సేవలందిస్తోంది. నిజాయితీ, పారదర్శకత, వినియోగదారుల పట్ల అంకితభావం మరియు నవీనత అనే విలువలతో కెనరా బ్యాంక్ దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.