23 May, 2026 | 7:06 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

ప్రజా సేవే లక్ష్యం.. గత అభివృద్ధే మాబలం

07-02-2026 12:20 AM

21 వ వార్డు కౌన్సిలర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి నరాల శేఖర్

వేములవాడలో కార్నర్ మీటింగ్‌తో వార్డులో ఊపందుకున్న ప్రచారం

వేములవాడ, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు కౌన్సిలర్‌గా బరిలో ఉన్న బీఆర్‌ఎస్ అభ్యర్థి నరాల శేఖర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చే శారు. గత పదేళ్లుగా తన కుటుంబం ప్రజాసేవలో కొనసాగుతోందని, మొదటి దఫా తన సతీమణి సౌజన్య ఐదేళ్లు, అనంతరం తాను ఐదేళ్లు ప్రజలకు సేవలందించామని తెలిపారు.

ఈ కాలంలో వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలతో మమేకమయ్యామని తెలిపారు.శుక్రవారం స్థానిక అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, చల్మెడ లక్ష్మీ నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భం గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ నరాల శేఖర్ యువ నాయకుడిగా, వార్డు సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా పనిచేశారన్నారు.

మరోసారి అవకా శం ఇస్తే వార్డును మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని, కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.నరాల శేఖర్ మా ట్లాడుతూ గత పదేళ్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా వంటి పనులు చేపట్టామని వివరించారు. శుద్ధజల కేంద్రం ద్వారా మంచినీటి సరఫరా, అర్హులైన వారికి పెన్షన్లు, సంక్షేమ పథకాలు, కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందేలా కృషి చేశామని తెలిపారు.వార్డులో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పంది స్తూ అందుబాటులో ఉంటానని, మరోసారి ఆశీర్వదించి కౌన్సిలర్‌గా గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ సీనియర్ నా యకులు,మాజీ సర్పంచ్ పొలాస నరేందర్ మాట్లాడుతూ నరాల శేఖర్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.