విశ్వనాథన్ విజయం హర్షణీయం
06-05-2026 02:24 AM
శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శిగా ఉన్న విశ్వనాథన్ తమిళనా డులోని మేలూరు నుంచి ఎమ్మెల్యేగా విజ యం సాధించారు. దీంతో పీసీసీ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్ చైర్మన్ రాజేష్‌కుమార్ అగర్వాల్ మంగళవారం చెన్నైకి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశ్వనాథన్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విశ్వనాథన్ విజ యంపై ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు కూడా హర్షం వ్యక్తం చేశారు.






