24 July, 2026 | 1:37 AM

మహిళల కోరిక మేరకు ముప్పిరితోటకు బస్సు

24-07-2026 12:29 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు

ఎలిగేడు, జులై 23 (విజయక్రాంతి) రెండున్నర ఏళ్ల క్రితం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్పు , ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. గురువారం ముప్పిరి తోటలో డిపో మేనేజర్ కవిత తో కలిసి విప్ విజయ రమణారావు గోదావరిఖని నుండి ముప్పిరితోట మీదుగా గర్రెపల్లి వరకు నడిచే ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో పాలకులు వచ్చినప్పటికీ పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు ప్రయత్నించిన దాఖలాలు లేవన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి మెప్పించడం వల్లే 2024 డిసెంబర్ లో పెద్దపల్లి లో నిర్వహించిన బహిరంగ సభలో బస్సు డిపో ఏర్పాటుకు ప్రకటన చేశారని చెప్పారు. రానున్న రెండు మాసాల్లో దేవి నవరాత్రుల ఉత్సవాల్లో పెద్దపల్లిలో బస్సు డిపోను ప్రారంభం చేసుకొని నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామన్నారు, ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సర్పంచ్ మారం రాయమల్లు, తహసిల్దార్ యాకన్న, ఎంపీడీవో భాస్కర్ రావు , ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.