15 August, 2026 | 2:41 AM

మూడు రూట్లలో బస్ సర్వీసులు

15-08-2026 01:23 AM

ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

గన్నేరువరం, ఆగస్టు 14 (విజయ క్రాంతి): ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మూడు మార్గాల్లో ప్రవేశపెట్టిన నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం గన్నేరువరం మండలం గుండ్లపల్లి వద్ద జెండా ఊపి ప్రారంభించారు. కరీంనగర్ నుంచి గన్నేరువరం, బెజ్జంకి మీదుగా హైదరాబాద్, కరీంనగర్ నుంచి గన్నేరువరం, కరీంనగర్ నుంచి బెజ్జంకి, రేపాక మీదుగా ఇల్లంతకుంటకు నడిచే బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం ఆయన పార్టీ నాయకులు, ఆర్టీసీ అధికారులతో కలిసి బస్సులో టిక్కెట్టు తీసుకొని కొంత దూరం ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, ఆర్టీసీ కరీంనగర్ -1 డిపో మేనేజర్ ఐ.విజయ మాధురి, అధికారులు పడాల రవీందర్, లక్ష్మయ్య, సంపత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునిల్, ముస్కు ఉపేందర్ రెడ్డి, మాతంగి అనిల్, జె.మన్మోహన్ రావు, సిహెచ్ శ్రీధర్ రెడ్డి, బుర్ర తిరుపతిగౌడ్, న్యాత జీవన్, సురేందర్ రెడ్డి, సంతోష్, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.