15 August, 2026 | 3:38 AM

మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

15-08-2026 01:22 AM

ముక్రంపుర, ఆగస్టు౧౪ (విజయక్రాంతి): నగరంలోని కిమ్స్ కాలేజీలో పోలీస్ ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ద్వారా మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు.

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఈగల్ టీం డీఎస్పీ ఉపేందర్, చైల్ హెల్ప్ లైన్ 1098 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆవుల సంపత్ యాదవ్, కిమ్స్ కాలేజ్ వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, మిషన్ వాత్సల్య సిబ్బంది సాదినేని రమేష్, స్వప్న, త్రీ టౌన్ సీఐ తిరుమల్, తదితరులు పాల్గొన్నారు.