15 May, 2026 | 11:59 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

బస్సు సౌకర్యం కాలనీ వాసులకు వరం చిగురు రేణుక రవికుమార్ ముదిరాజ్

01-03-2026 06:49 PM

మేడిపల్లి,(విజయక్రాంతి):  మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ 11వ డివిజన్ పరిధిలోని సూరజ్ నగర్ ప్రాంతానికి ఆర్టిసి బస్సు సౌకర్యం కల్పించడం స్థానిక ప్రజలకు వరంగా మారుతుందని  సీనియర్ బిఆర్ఎస్ నాయకులు చిగురు రేణుక రవికుమార్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం సూరజ్ నగర్ కాలనీ నుంచి బోడుప్పల్ మీదుగా సికింద్రాబాద్ వరకు ఆర్టీసీ సిటీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సూరజ్ నగర్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతిరోజూ వందలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు, మహిళలు ప్రయాణం చేస్తారని,

కానీ ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో  వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తమ ఇబ్బందులను ఆర్టీసీ అధికారులకు తెలపడంతో స్పందించిన అధికారులు తమ కాలనీ నుంచి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కాలనీవాసులు సైతం ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని సౌకర్యవంతంగా ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, కాలనీవాసులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.