11 July, 2026 | 2:21 PM

Breaking News

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్లు   •   మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •  

బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య

20-04-2026 12:04 AM
  1. ఫీజు కట్టలేదని.. హాజరు శాతం లేదని

శ్రీ ఇందూ ఇంజినీరింగ్ కళాశాలలో వేధింపులు 

అబ్దుల్లాపూర్‌మెట్/ఎల్బీనగర్, ఏప్రిల్ 19 : ఫీజు కట్టలేదని... హాజ రు శాతం లేదని.. పరీక్షలు రాయడానికి హాల్ టికెట్ ఇవ్వక పోవటంతో మనస్తాపం చెందిన థర్డీయర్ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల కే్ంరద్రానికి మ్యాదరి ప్రణీత్ కుమార్ (22) రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని  శ్రీ ఇందూ కాలేజీలో సీఎస్సీడీ బీటెక్ థర్డీయర్ చదువుతున్నాడు.

హయత్‌నగర్‌లోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఉంటూ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయితే, పరీక్షల సమయం దగ్గర పడడంతో ఫీజు చెల్లించలేదని వేధింపులకు గురి చేసింది. కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో  మనస్తాపానికి గురైన ప్రణీత్ శనివారం రాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు  ఉరివేసుకొని  ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సందర్భంగా మృతుడి తండ్రి మాట్లాడుతూ... శ్రీ ఇందూ కళాశాలలో ఏవోగా పనిచేస్తున్న కృష్ణమూర్తి .. ఫీజు కట్టలేదని... హాల్ టికెట్ కావలంటే రూ, 5 వేలు ఇవ్వాలని ప్రణీత్‌ను విద్యార్థుల ముందే అవమానించినట్లు ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నామని  హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు గౌడ్ తెలిపారు.