ఆమనగల్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను విస్తరించాలి
ఎంపీ మల్లు రవికి కాంగ్రెస్ నాయకుల వినతి
ఆమనగల్, జూలై 17 (విజయక్రాంతి): ఆమనగల్లు పట్టణంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలకు బిఎస్‌ఎన్‌ఎల్ సెల్ ఫోన్ సేవలను విస్తరించాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవిని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎంపీ నివాసంలో ఆమనగల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, డీసీసీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు శెట్టిపల్లి సత్యం, రవికుమార్, ఖాదర్ ఖాద్రి తదితరులు శుక్రవారం ఎంపీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవిని వారు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మండలంలోని పలు సమస్యలపై ఎంపీకి వినతిపత్రం సమర్పించారు. ఆమనగల్లు పట్టణంలో త్వరితగతిన బిఎస్‌ఎన్‌ఎల్ 5G సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.
అలాగే, మండల పరిధిలోని మాలేపల్లి గ్రామంలో తీవ్రంగా ఉన్న ఫోన్ సిగ్నల్ సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా సెల్ టవర్ మంజూరు చేయాలని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనితో పాటు మల్లెపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని వారు ఈ సందర్భంగా అభ్యర్థించారు. కాంగ్రెస్ నాయకుల వినతులపై ఎంపీ సానుకూలంగా స్పందించారు.






