18 April, 2026 | 1:03 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

పిసిబిడ్డ గొంతు నులిమిన కసాయి తండ్రి

16-04-2026 12:44 AM
  1. చిన్నారి పాప మృతి
  2. పోలీసులకు ఎదుట లొంగిపోయిన నిందితుడు
  3. భువనగిరి జిల్లాలో ఘటన

ఆలేరు, ఏప్రిల్ 15 (విజయక్రాం తి): భార్య మీద కోపంతో రెండెండ్ల కన్నకూతురుని ఊపిరాడకుండా చేసి చంపిన హృదయవిదారక సంఘటన భువనగిరి మండలం హన్మాపురంలో బుధవారం ఉదయం జరిగింది. హన్మాపురంకు చెందిన ఎర్రబోయిన శ్రీరాములు, నాగరాణిలు భార్యభర్త లు. వీరికి రెండేళ్ల నిత్యశ్రీ కూతురు ఉంది. భార్యభర్తలిద్దరూ పుట్టుకతోనే మూగ, చెవుడు. శ్రీరాములు గ్రామపంచాయతీ కార్మికులు, తల్లి, ఇద్దరు సోదరులతో కలిసి ఉమ్మడిగా ఉంటున్నారు.

ఆస్తి విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్య నాగరాణి పుట్టింటికి వెళు తుండేది. గొడవ జరిగిందన్న విష యం తెలుసుకున్న నాగరాణి తండ్రి కుట్ల మల్లయ్య బుధవారం కూతురు ను తీసుకొని వెళదామని వచ్చా డు. భార్య కూతురిని కూడా పుట్టింటికి తీసుకువెళుతుందని భావించిన శ్రీరాములు కూతురిని గ్రామ శివారులోకి తీసుకువెళ్లాడు. కూతురు ఏడుస్తుందని నోరు, ముక్కును బలంగా నొక్కి పట్టాడు.

దీంతో బాలిక ఊపిరాడక సృహ తప్పిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే బాలి కను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెంది నట్లుగా వైద్యులు ధృవీకరించారు. కూతురు మరణించిందన్న విషయం తెలుసుకున్న శ్రీరాములు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. చిన్నారి తాత కుట్ల మల్లయ్య ఫిర్యాదు మేరకు శ్రీరాములుపై భువనగిరి రూరల్ సిఐ ఎన్.చంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.